: రాజ్యసభ సభ్యుడు షాదీలాల్ బత్రాపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు షాదీలాల్ బత్రా(76) తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ హర్యానా మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని తన చుట్టూ తిరిగేలా చేసి ఆయన తనను వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎంపీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి దర్యాప్తు తరువాత ఆయనను అరెస్టు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.