: విద్యార్థుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన టీచర్ కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించిన ఢిల్లీ సర్కార్


పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయిలో ప్రభుత్వ పాఠశాలలో నిన్న‌ ముఖేశ్ కుమార్ అనే హిందీ టీచర్‌ని త‌మ‌కు హాజ‌రు వేయ‌లేద‌నే కార‌ణంతో ఇద్ద‌రు విద్యార్థులు క‌త్తితో పొడిచి చంపారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ముఖేశ్ కుమార్ కుటుంబానికి ఈరోజు కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది. తాము ఇస్తోన్న డ‌బ్బు ఆ కుటుంబానికి పరిహారంగా చెల్లించడం లేదని, ఆర్థిక సాయమే చేస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా ఆ రాష్ట్ర ఉప‌ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ఆ ఉపాధ్యాయుడి కుటుంబం అనుభ‌వించే బాధ‌కు ఎటువంటి పరిహారమూ సరిపోదని ఆయ‌న అన్నారు. తక్షణ ఆర్థిక సాయంగా తాము కోటి రూపాయ‌లు ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు. ముఖేశ్ కుమార్ నిన్న రాత్రి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా మనీష్ సిసోడియా ఆసుప‌త్రికి చేరుకొని ఆయ‌న‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని సూచించారు. కానీ, ప‌రిస్థితి విష‌మించ‌డంతో ముఖేశ్ కుమార్ మృతి చెందాడు.

  • Loading...

More Telugu News