: ఎంఎన్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో రహస్యంగా దేశం దాటిన పాక్ నటుడు ఫవాద్ ఖాన్


ఈ నెల 25వ తేదీలోపు పాకిస్థాన్ కు చెందిన నటీనటులంతా దేశం విడిచిపోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అల్టిమేట్టం జారీ చేసిన నేపథ్యంలో, పాక్ నటుడు, కరణ్ జొహార్ చిత్రంలో నటించిన ఫవాద్ ఖాన్ ఎవరికీ చెప్పా పెట్టకుండా దేశాన్ని దాటాడు. ఇక ఇప్పట్లో ఇండియాకు రావాలన్న ఉద్దేశం ఎంతమాత్రమూ లేని ఫవాద్, స్వదేశానికి చేరిపోయాడని తెలుస్తోంది. నటీనటులకు భద్రత కల్పిస్తామని ముంబై పోలీసులు అభయమిచ్చినా, పాక్ నటీనటులు మాత్రం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, ఎంఎన్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో తన సినిమా ప్రమోషన్ లో ఫవాద్ పాల్గొనబోవడం లేదని ఇప్పటికే కరణ్ జొహార్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News