: నాడు భార్యాబిడ్డలు, నేడు తండ్రీకొడుకులు... కొడుకు సహా కార్పొరేట్ వ్యవహారాల మాజీ డీజీ బీకే బన్సాల్ ఆత్మహత్య
ఓ ఫార్మా కంపెనీ నుంచి లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖ కేసులో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్లి వచ్చిన కార్పొరేట్ వ్యవహారాల మాజీ డైరెక్టర్ జనరల్ బీకే బన్సాల్, తన కుమారుడు సహా ఆత్మహత్య చేసుకున్నారు. భారీ ఎత్తున లంచాలు తీసుకున్న ఆరోపణలు, ఆపై ఆయన ఇంట్లో రూ. 20 లక్షలు, 60 బ్యాంకు ఖాతాల్లో పెద్దమొత్తంలో నగదు, 20కి పైగా ఆస్తుల డాక్యుమెంట్లు బయటపడ్డ సంగతి తెలిసిందే. జూలైలో బన్సాల్ ను అరెస్ట్ చేయగా, ఆపై రెండు రోజులకు ఆయన భార్య, కుమార్తె అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న ఆయన అదే అవమానభారంతో పరువు పోయిందన్న దిగులుతో కుమారుడు సహా సూసైడ్ చేసుకోవడం ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపింది. సొంత ఇంట్లోనే వీరు ఆత్మహత్య చేసుకున్నారని, కేసు దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.