: హైదరాబాద్‌లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో దారుణం.. ఆపరేషన్ వికటించి మహిళకు బ్రెయిన్ డెడ్


హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఈరోజు దారుణం చోటు చేసుకుంది. పిల్ల‌లు లేర‌ని బాధ‌ప‌డుతున్న ఓ దంప‌తులు ఆ ప్రాంతంలోని సృజ‌నా సంతాన సాఫ‌ల్య కేంద్రంలో చికిత్స చేయించుకుంటున్నారు. సంతానం కోసం అంటూ వైద్యులు స‌ద‌రు మ‌హిళ‌కు ఆప‌రేష‌న్ చేస్తున్న స‌మయంలో.. శ‌స్త్ర‌చికిత్స‌ వికటించడంతో ఆమె బ్రెయిన్‌డెడ్‌కు గురైంది. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకొని ఆ కేంద్రంపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి పేరు జ్యోతి అని మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News