: తొలిమెట్టు ఎక్కిన హిల్లరీ... 90 నిమిషాల చర్చలో ట్రంప్ పై హిల్లరీ పైచేయి!
మరో నెలన్నరలో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సమయంలో.. తాజాగా జరిగిన బిగ్ డిబేట్ లో హిల్లరీ క్లింటన్, తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై భారీ పైచేయి సాధించింది. ఈ ప్రత్యక్ష వాదన అనంతరం సీఎన్ఎన్ - ఓఆర్సీ ఓ పోల్ ను నిర్వహించగా, 62 శాతం మంది హిల్లరీ క్లింటన్ ప్రసంగం అద్భుతమని చెప్పారు. ట్రంప్ కు కేవలం 28 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. అమెరికాకు తానేం చేస్తానన్న విషయాన్ని విడమరిచి చెప్పడంలో హిల్లరీ విజయవంతం కాగా, ట్రంప్ వ్యక్తిగత ఆరోపణలకు దిగి సమయాన్ని వృథా చేశారని అత్యధికులు అభిప్రాయపడటం గమనార్హం. మరో 10 మంది ఇప్పుడే తమ మద్దతు ఎవరికిస్తామో చెప్పలేమని వెల్లడించినట్టు సీఎన్ఎన్ - ఓఆర్సీ వెల్లడించింది.