: ఈ ఏడాది కాలంలో మంచీచెడులతో పాటు, బాధ కలిగించే అంశాలు కూడా చోటుచేసుకున్నాయి: సుష్మా స్వరాజ్


ఐక్యరాజ్యసమితిలో గత ఏడాది సమావేశాలకు, ఈసారి సమావేశాలకు మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. న్యూయార్క్ లో ఆమె మాట్లాడుతూ, ఈ ఏడాది సమయంలో ప్రపంచ వ్యాప్తంగా మంచీచెడులతోపాటు బాధను కలిగిచే సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని అన్నారు. భారత్ లో శానిటేషన్ లో చైతన్యం కోసం స్వచ్ఛ బారత్, జన్ ధన్ యోజన, నిరుద్యోగాన్ని తరమికొట్టేందుకు శిక్షాభారత్ ను ప్రారంభించామని అన్నారు. భేటీ బచావ్-భేటీ పఢావ్, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇలా భారత్ ను అన్ని రంగాల్లో ఉన్నతంగా నిలిపేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చి, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించేందుకు తాము ప్రణాళికలు చేపట్టామని ఆమె చెప్పారు. అందులో భాగంగా ప్రకృతితో మమేకమయ్యేలా కోట్లాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రాలు చేపట్టాయని ఆమె చెప్పారు. జల, వాయు, సోలార్ శక్తులను వినియోగించుకోవడంలో భారత్ అద్భుతమైన పాత్ర పోషిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. పేదరిక నిర్మూలన, నిరుద్యోగం వంటి సామాజిక రుగ్మతలను పారద్రోలడం ప్రపంచం లక్ష్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News