: ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్ ధోనీ రికార్డును సమం చేశాడు. కాన్పూర్ లో జరిగిన ప్రతిష్ఠాత్మక 500వ టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధిచడం ద్వారా కోహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో ధోనీ వరుసగా 11 విజయాలు సాధించి, సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నాలుగో స్థానంలో నిలిచాడు. 18 వరుస విజయాలు సాధించిన సునీల్ గవాస్కర్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా అగ్రస్థానంలో నిలవగా, ఆ తరువాత రెండో స్థానంలో 17 వరుస టెస్టు విజయాలతో కపిల్ దేవ్, 14 వరుస టెస్టు విజయాలతో మహ్మద్ అజహరుద్దీన్ మూడవ స్థానంలో నిలిచారు. 11 వరుస విజయాలతో ధోనీ నాలుగో స్థానంలో నిలవగా, కివీస్ పై తొలిటెస్టు విజయంతో కోహ్లీ ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు.