: కర్నూల్ లో కుప్పకూలిన పాతభవనం..ఇద్దరు మహిళల మృతి
ఒక పాత భవనం కుప్పకూలిన సంఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందిన విషాద సంఘటన కర్నూల్ జిల్లాలోని బండిఆత్మకూరు మండలం పార్నపల్లెలో జరిగింది. వర్షాల కారణంగా పాతభవనం కూలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. కాశమ్మ అనే వృద్ధురాలు పార్నపల్లెలోని తన ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. ఆమెను పలకరించేందుకు సలీమా అనే మహిళ అక్కడికి వెళ్లింది. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో, మహిళలిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది.