: ఉస్మానియా ఆసుప‌త్రి భ‌వనం వందేళ్ల క్రితం నాటిది: మంత్రి లక్ష్మారెడ్డి


ఉస్మానియా ఆసుప‌త్రి భ‌వనం వందేళ్ల క్రితం నాటిదని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి అన్నారు. ఈరోజు ఆయ‌న అధికారుల‌తో క‌ల‌సి హైద‌రాబాద్‌లోని ప‌లు ఆసుప‌త్రులను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఉస్మానియా ఆసుప‌త్రికి త్వ‌ర‌లోనే కొత్త భ‌వ‌నం నిర్మిస్తామ‌ని చెప్పారు. అప్ప‌టివ‌ర‌కు పాత భ‌వ‌నంలోనే సేవ‌లు కొన‌సాగుతాయ‌ని చెప్పారు. ఆసుప‌త్రిలో అన్ని సేవ‌లు స‌మ‌ర్థంగా అందిస్తామ‌ని తెలిపారు. అనంత‌రం ఆయ‌న పంజాగుట్ట‌లోని నిమ్స్ ఆసుప‌త్రిలో ప‌ర్య‌టించి అత్య‌వ‌స‌ర విభాగాన్ని త‌నిఖీ చేశారు.

  • Loading...

More Telugu News