: ఎన్ని చెప్పులు విసురుతారో విసురుకోండి: రాహుల్ గాంధీ


ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఈరోజు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఒక వ్యక్తి విసిరిన బూట్ ఆయన పక్కనుంచి పోయింది. ఈ సంఘటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందిన వారే తనపై షూ విసిరారని ఆయన ఆరోపించారు. తాను ఇటువంటి సంఘటనలకు భయపడబోనని, ఇంకా ఎన్ని చెప్పులు విసురుతారో విసురుకోవాలని అన్నారు. కాగా, రాహుల్ పై షూ విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News