: ఎంత డబ్బున్నా... ప్రేమను పంచుకునేవారు లేకపోతే ఆందోళనే!: కరణ్ జోహర్


నిరాశనిస్పృహలకు ఎవరూ అతీతం కాదని బాలీవుడ్ నటులు నిరూపిస్తున్నారు. కెరీర్ పీక్ లో ఉండగా తాను హఠాత్తుగా డిప్రెషన్ లో కూరుకుపోయానని దీపికా పదుకునే గతంలో వెల్లడించిన సంగతి విదితమే. తాను కూడా అలాంటి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నానని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ తెలిపాడు. తాను డిప్రెషన్ లో ఉన్నప్పుడు...'ఆనందోద్రేకాలు ఉండేవి కావు. నిద్రకు దూరమై ఎప్పుడూ బాధ పడేవాడ్ని. మా నాన్న దూరం కావడంతో జీవితాన్ని సరిగ్గా మలుచుకోలేనేమోనన్న భావన వెంటాడేది. ఒంటరిగా ఉండి, ఎవరితో రిలేషన్‌ షిప్‌ లో లేనప్పుడు జీవితం ఎటు పోతున్నదనే ఆలోచన కలిగేది. ఎన్ని విజయాలు, ఎంత పేరుప్రఖ్యాతులు ఉన్నా ప్రేమను పంచుకోవడానికి ఎవరూ లేకపోతే అది ఆందోళన కలిగిస్తుంది' అని కరణ్‌ చెప్పాడు. ఏడాదిన్నరపాటు చికిత్స తీసుకోవడంతో ఇప్పుడు ఆనందోద్రేకాలు అనుభవిస్తున్నానని తెలిపాడు.

  • Loading...

More Telugu News