: కాశ్మీర్ లో మళ్లీ దాడి.. సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు
దక్షిణ కాశ్మీర్ లో అనుమానిత ఉగ్రవాదులు మళ్లీ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు గాయపడ్డారు. దక్షిణ శ్రీనగర్ లోని కుల్గామ్ జిల్లాలోని ఒక గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ఈ దాడి జరిగింది. అనుమానిత ఉగ్రవాదులు ప్రయోగించిన గ్రెనేడు గురితప్పి రోడ్డు పక్కకు పడి పేలింది. ఈ సంఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్లు ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.