: మోదీ మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు: పాక్ విదేశాంగ కార్యదర్శి


భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ చౌదరి గగ్గోలు పెడుతున్నారు. కొన్నాళ్లుగా మోదీ చేస్తున్న ప్రకటనలు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోకూడదనే ఐక్యరాజ్యసమితి నిబంధనలకు వ్యతిరేకమని అన్నారు. ‘ఉగ్రవాద ఎగుమతిదారు’గా పాక్‌ మారిందన్న మోదీ ఆరోపణని ప్రస్తావించిన ఆయన, కశ్మీర్‌ వివాద పరిష్కారంలో పాకిస్థాన్‌ ను ఒక పక్షంగా ఐక్యరాజ్యసమితి పలు తీర్మానాల్లో గుర్తించిన విషయం తెలిసిందేనని ఆయన గుర్తుచేశారు. భారత నాయకత్వం పాకిస్థాన్ పై నిందారోపణలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News