: అ'స్పిన్'తోనే ఇంతటి ఘన విజయం


పేటీఎం సిరీస్ లో భాగంగా కాన్పూర్ లో జరిగిన తొలి టెస్టు భారత పరమైంది. ఈ మ్యాచ్ ఇండియా ఆడుతున్న 500వ టెస్టు మ్యాచ్ కావడంతో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన మాయ ఆరుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లను పెవీలియన్ దారి పట్టించింది. ఓపెనర్లు లాథమ్, గుప్తిల్ లతో పాటు వన్ డౌన్ బ్యాట్స్ మన్ విలియమ్ సన్, ఆపై మిడిల్ ఆర్డర్ లో ప్రమాదకరంగా మారిన శాట్ నర్, టెయిలెండర్లు సోధీ, వాగ్నర్ లను అశ్విన్ అవుట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఓ టెస్టులో 10 వికెట్లను తీసిన ఆటగాళ్ల క్లబ్ లో రవిచంద్రన్ అశ్విన్ పేరు కూడా చేరిపోయింది.

  • Loading...

More Telugu News