: మీ ఉత్సాహంతో నా పట్టుదల రెట్టింపైంది: వైఎస్ జగన్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే దిశగా ప్రవాస భారతీయులు చూపిన ఉత్సాహం తనలో పట్టుదలను రెట్టింపు చేసిందని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. గత రాత్రి పలు దేశాలకు చెందిన ఎన్నారైలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై జగన్ స్పందించారు. "ఎన్నారై సోదర సోదరీమణులు చూపిన ఉత్సాహంతో ఏపీకి ప్రత్యేక హోదా సాధన దిశగా నా పట్టుదల రెండింతలైంది. మీ అందరికీ కృతజ్ఞతలు" అని అన్నారు.

  • Loading...

More Telugu News