: నయీమ్ కేసును ఎమర్జెన్సీగా పరిగణించి విచారించాలని హైకోర్టును కోరిన సీపీఐ నారాయణ
ఇటీవలే తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసును సిట్‌తో కాకుండా సీబీఐతో విచారణ చేయించాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఆయన వేసిన పిటిషన్ ఈరోజు హైకోర్టు ముందుకొచ్చింది. నయీమ్ కేసును ఎమర్జెన్సీగా పరిగణించి విచారించాలని న్యాయస్థానాన్ని సీపీఐ నారాయణ కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ సీబీఐ వాదనలు వినకుండా విచారణ సరికాదని తెలిపింది. దీనిపై మరిన్ని వాదనలు వింటున్న హైకోర్టు మరికాసేపట్లో తమ నిర్ణయాన్ని తెలపనుంది.