: కీలక వికెట్ ను తీసి చారిత్రాత్మక విజయానికి బాటలేసిన జడేజా
గెలిచే అవకాశాలు నామమాత్రంగా ఉన్న వేళ, కనీసం జిడ్డు ఆట ఆడుతూ డ్రాతో గట్టెక్కాలని చూస్తున్న న్యూజిలాండ్ కు జడేజా షాకిచ్చాడు. 120 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 80 పరుగులు చేసి భారత బౌలర్లకు సవాల్ గా నిలిచిన రోంచీని పెవీలియన్ దారి పట్టించాడు. జడేజా విసిరిన బంతి గింగిరాలు తిరుగుతూ రాగా, దాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయిన రాంచీ, బంతిని గాల్లోకి పంపడంతో అశ్విన్ దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 5వ వికెట్ ను కోల్పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 60 ఓవర్లలో 170 పరుగులు కాగా, ఆ జట్టు చేతిలో మరో 5 వికెట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ జట్టు విజయానికి ఇంకా 264 పరుగులు చేయాల్సి వుంది. భారత్ ఆడుతున్న 500వ టెస్టులో విజయం సాధించాలంటే, మరో 5 వికెట్లను పడగొట్టాలి.