: పక్కవాళ్లతో పోల్చిచూసుకోను: మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణి మాలిక్


పక్కవాళ్లతో పోల్చి చూసుకోవడం, 'అమ్మో! వాళ్లు ఇన్ని సినిమాలు చేసేస్తున్నారు' అనుకోవడం వంటివి తనకు తెలియదని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పక్కవాళ్లతో పోల్చి చూసుకునే రన్నింగ్ రేసులో తాను ఉండనని, తన కుటుంబంతో ఎంత మేరకు సంతోషంగా గడుపుతున్నామనే విషయం తనకు ముఖ్యమని అన్నారు. తన కుటుంబంతో గడపడం తనకు చాలా ఆనందాన్నిస్తుందని, డబ్బు సంపాదించడం అవసరం కనుక, అందుకు తాను ఎంచుకున్న మార్గం ‘సినిమా’ అని చెప్పారు.

  • Loading...

More Telugu News