: అత్యవసర మందుల నుంచి డయాబెటిక్ ఔషధాల తొలగింపు... పెరగనున్న ధరలు
అత్యవసర మందుల నుంచి మదుమేహం, మతిమరుపు, హైపర్ టెన్షన్ (బీపీ) తదితర రుగ్మతలకు వాడే ఔషధాలను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం 100 రకాల ఔషధాలను 'ఎసెన్షియల్ మెడిసిన్స్' జాబితా నుంచి తొలగించడంతో వీటన్నింటి ధరలూ 10 శాతం వరకూ పెరగవచ్చని నిపుణులు వ్యాఖ్యానించారు. వీటన్నింటిపై ధరా నియంత్రణ తొలగనుండటం, ఔషధ కంపెనీలకు మేలు చేకూర్చే నిర్ణయమే అయినా, ప్రజల జేబులకు చిల్లు పడుతుందని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరంలో అత్యవసర ఔషధాల ధరలను పెంచరాదని నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అధారిటీ (ఎన్పీపీఏ) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్స్ సైతం అదే నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించడంతో, ఫార్మా కంపెనీల ఈక్విటీలు పతనం అయ్యాయి. గత సంవత్సరం డిసెంబర్ లో 875 ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకు వచ్చారు. వాటిల్లో 100 రకాలను ఇప్పుడు తొలగించారు.