: ఇంకా పాకిస్థానేంటి?.. టెర్రరిస్థాన్‌గా మార్చండి.. ప్రముఖ రచయిత చేతన్ భగత్


ఉరీ ఉగ్రదాడిపై ఎల్లెడల నుంచి పాకిస్థాన్ విమర్శలు ఎదుర్కొంటున్న వేళ.. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ యూఎన్ జనరల్ అసెంబ్లీలో చేసిన ప్రసంగంతో నెటిజన్లు మండిపోతున్నారు. పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా షరీఫ్ వైఖరిని ఎండగడుతున్నారు. మరోవైపు పాకిస్థాన్ పేరును ఇక నుంచి టెర్రరిస్థాన్‌గా మార్చేందుకు ప్రపంచదేశాలు కలిసి రావాలని ప్రముఖ రచయిత చేతన్ భగత్ కోరారు. పాకిస్థాన్ పేరును వీలైనంత త్వరగా మార్చేసి ఆ స్థానంలో టెర్రరిస్థాన్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. వీధులకు, నగరాలకు, రోడ్లకు పేర్లు మార్చే సంస్కృతి ఉన్నప్పుడు పాకిస్థాన్ పేరును ఎందుకు మార్చకూడదని చేతన్ భగత్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News