: ఎయిర్ టు ఎయిర్ 'మికా' మిసైల్ ను విజయవంతంగా ప్రయోగించిన వాయు సేన
ఇటీవల వాయుసేన అమ్ముల పొదిలోకి చేరిన లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ 'మికా'ను విజయవంతంగా ప్రయోగించినట్టు అధికారులు తెలిపారు. మిరేజ్-2000 యుద్ధ విమానం నుంచి క్షిపణిని ప్రయోగించగా, అది లక్ష్యాన్ని తాకిందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తక్కువ ఎత్తులో విమానంతో పోలిస్తే, చిన్నగా ఉన్న లక్ష్యాన్ని మిసైల్ ఢీకొట్టిందని తెలిపింది. ఈ తరహా లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించే సత్తా ఉన్న అతి కొద్ది దేశాల్లో ఇండియా కూడా ఒకటిగా నిలిచిందని రక్షణ శాఖ వ్యాఖ్యానించింది. ఈ తరహా క్షిపణి వ్యవస్థల్లో మరింత అత్యాధునిక సాంకేతికను వినియోగించనున్నట్టు తెలిపింది.