: యూరీకి వచ్చి స్థానికులుగా నటిస్తూ, ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరు పాకిస్థానీల అరెస్ట్
పాకిస్థాన్ నుంచి వచ్చిన ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులను యూరీ సెక్టారులో సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆర్మీ బేస్ కు సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు వీరు సాయం చేస్తున్నారని సైన్యాధికారి ఒకరు తెలిపారు. వీరిద్దరూ పాకిస్థాన్ జాతీయులేనని స్పష్టం చేశారు. ఇందులో ఒక వ్యక్తి సాయంతోనే యూరీ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు చొరబడ్డారని తెలిపారు. స్థానికులుగా నటిస్తూ, వీరు ఉగ్రసాయం అందిస్తున్నారని తెలిపారు. వీరి పేర్లు అహసాన్ ఖుర్షీద్, ఫైసల్ హుస్సేన్ అవాన్ అని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఖలియానా కలాన్, పోత్తా జహంగీర్ ప్రాంతాల నుంచి వచ్చారని వివరించారు. వీరు రెండేళ్ల క్రితం జైషే మొహమ్మద్ లో చేరారని, ప్రస్తుతం ఇద్దరినీ విచారిస్తున్నామని తెలిపారు.