: అశ్విన్, జడేజా సూపర్ స్పెల్...5 ఓవర్లలో 7 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చారు
టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు సూపర్ స్పెల్ వేశారు. ఐదు ఓవర్లలో 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన వీరి ప్రతిభ సర్వత్ర ప్రశంసలు అందుకుంటోంది. కాన్పూర్ వేదికగా ప్రతిష్ఠాత్మక భారత 500వ టెస్టు మ్యాచ్ తొలి రెండు రోజులు రెండు జట్లు ఆధిక్యం ప్రదర్శించాయి. తొలి రోజు భారత్ బ్యాట్స్ మన్ ఆధిక్యం చూపిస్తే, రెండో రోజు న్యూజిలాండ్ బౌలర్లు, బ్యాట్స్ మన్ రాణించారు. మూడో రోజు క్రీజులో పాతుకుపోయిన న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ ఒక వికెట్ నష్టానికి 152 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో టీమిండియా స్పిన్ ద్వయం జూలు విదిల్చింది. ఓపెనర్లను పెవిలియన్ కు పంపారు. దీంతో కివీస్ పతనాన్ని శాసించారు. 34 ఓవర్లు వేసిన రవీంద్ర జడేజా 5 వికెట్లు తీయగా, 30.5 ఓవర్లు వేసిన అశ్విన్ 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో వీరిద్దరూ 5 ఓవర్లలో 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీశారు. 92, 96 ఓవర్లలో అశ్విన్ చెరో వికెట్ తీయగా, 95వ ఓవర్ లో జడేజా మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో 91వ ఓవర్ ముగిసే సమయానికి కివీస్ స్కోర్ 255/5 కాగా, 96వ ఓవర్ చివరి బంతికి న్యూజిలాండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ జట్టు తొలి 262/10 ఇన్నింగ్స్ ముగించింది.