: కొత్త ఆవిష్కరణ... పాలకూర నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు


ఇజ్రాయెల్ కు చెందిన శాస్త్రవేత్తలు పాలకూరతో విద్యుత్తును ఉత్పత్తి చేశారు. దీంతో ఇంతవరకు అందుబాటులో ఉన్న థర్మల్‌, హైడ్రల్‌, విండ్, సోలార్ పవర్ కు గ్రీన్ ఎలక్ట్రిసిటీ తోడైంది. పాలకూర గుజ్జు నుంచి బయో ఫొటో ఎలక్ట్రో కెమికల్‌ (బీపీఈసీ) మూలకాన్ని (కణం) ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇలా ఉత్పత్తి చేసిన విద్యుత్ ను గ్రీన్ ఎలక్ట్రిసిటీగా వారు వ్యవహరిస్తున్నారు. నీటిలోని హైడ్రోజన్‌, సూర్యకాంతిని ఉపయోగించి ఈ కణాల ద్వారా విద్యుత్‌ ను ఉత్పత్తి చేశారు. కిరణజన్య సంయోగ క్రియలో మాదిరిగా సూర్య కిరణాలు నేరుగా ఆకులపై పడి ఆ వెలుతురు ఎలక్ట్రాన్స్‌ రూపంలోకి మారి మొక్కలకు ఇంధనంగా పనిచేస్తుంది. బీపీఈసీ కణాలపై పడే సూర్యకాంతి ఎలక్ట్రాన్స్‌ ప్రవాహంలా మారుతుంది. దీనికి ఐరన్‌ మూలకాన్ని వాడి విద్యుత్‌ ను ఉత్పత్తి చేశారు. అయితే ఇది పెద్దఎత్తున తయారు చేయడం సాధ్యమా? కాదా? సాధ్యమైతే ఎలా? ఎంత మోతాదులో ఈ విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు? వంటి వివరాలు వెల్లడికావాల్సిఉంది.

  • Loading...

More Telugu News