: రైల్వే జోన్ కోసం విశాఖలో సీఐటీయూ భారీ ర్యాలీ
విశాఖపట్టణానికి రైల్వే జోన్ ను కేటాయించాలని డిమాండ్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని వైజాగ్ లోని అక్కయ్యపాలెం నుంచి రైల్వే డీఆర్ఎం కార్యాలయం వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలోనే న్యాయ జరగకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో చర్చించి ఎంతోకాలంగా ఉన్న డిమాండ్ ను నెరవేర్చేందుకు, విశాఖకు రైల్వే జోన్ వచ్చేందుకు కృషి చేయాలని వారు సూచించారు.