: వాటే స్మార్ట్ ఫోన్?... 60 ఎంపీ కెమెరా, 1000 గిగాబైట్ల స్టోరేజి!
రోజుకో మోడల్ లో అత్యధునాతన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్న వేళ, రోబోటిక్స్ ఇండస్ట్రీస్ అనే సంస్థ 'మెనోలిత్ చకోన్' అనే కొత్త స్మార్ట్ ఫోన్ ను అభివృద్ధి చేస్తుండగా, దాని ఫీచర్లు ఆన్ లైన్లో హల్ చల్ చేస్తున్నాయి. 2018లో మార్కెట్ లోకి రానున్న ఈ ఫోన్ ఫీచర్లేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు... 6.4 అంగుళాల స్క్రీన్, 2160/3840 పిక్సెల్ రెజల్యూషన్, 1000 గిగాబైట్లకు పైగా స్టోరేజి, వెనుకవైపు 60 ఎంపీ కెమెరా, ముందు 20 ఎంపీ కెమెరా, 4 సిమ్ కార్డుల సౌకర్యం, 2 మైక్రో ఎస్డీ కార్డులు వాడుకునే సౌకర్యం తదితరాలు ఉన్నాయట. మరి ఈ ఫోన్ ధర ఎంత వరకూ ఉండవచ్చనే విషయం తెలియాలంటే మరో ఏడాదిన్నర ఆగాల్సిందేనేమో!