: కశ్మీర్ ను చూసి ఒళ్లుమండిన ప్రజల ఆగ్రహమే యూరీ దాడి: పాక్ ప్రధాని నవాజ్ ప్రేలాపనలు


యూరీలోని ఆర్మీ బేస్ పై జరిగిన దాడికి కశ్మీర్ ప్రాంతంలో భారత సైన్యం అకృత్యాలకు ఒళ్లుమండిన ప్రజలే కారణమని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ నుంచి పాక్ కు తిరిగి వస్తున్న ఆయన మార్గమధ్యంలో లండన్ లో ఆగి మీడియాతో మాట్లాడారు. "కశ్మీర్ లో ప్రజలపై భారత్ పాల్పడుతున్న హింసపై స్పందించిన బాధితుల బంధుగణం యూరీపై దాడి చేసింది. మరణించిన, చూపు కోల్పోయిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరి ఆగ్రహమే యూరీ దాడి. ఇండియా మాత్రం విచారణ జరపకుండానే పాకిస్థాన్ పై నిందలేస్తోంది. ఇది బాధ్యతారాహిత్యం. దాటి జరిగిన గంటల్లోనే అది పాకిస్థాన్ పనేనని ఎలా చెబుతారు?" అంటూ నవాజ్ ప్రశ్నించారు. గడచిన రెండున్నర నెలల వ్యవధిలో కశ్మీర్ లోయలో 108 మంది చంపబడ్డారని, 150 మంచి చూపు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారని ఆయన అన్నారు. కశ్మీర్ లో జరుగుతున్న హత్యలపై భారత సర్కారు విచారణ చేపట్టాలని నవాజ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News