: బాహుబలిలో నటించిన దున్నపోతును సాకలేమన్న రాఘవేంద్ర మఠం!
ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన బాహుబలి సినిమాలో నటించిన దున్నపోతు గుర్తుందా? క్లైమాక్స్ లో యుద్ధం జరిగే సన్నివేశాలకు ముందు అమ్మవారికి జంతువును బలిచ్చే సీన్ లో కనిపిస్తుంది. షూటింగ్ కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకించి కొనుగోలు చేసి తెచ్చిన దీన్ని, సినిమా తరువాత మంత్రాలయం రాఘవేంద్ర మఠానికి ఇచ్చారు. దీన్ని సాకడం తమకు తలకుమించిన పనేనని తేల్చిన మఠం, చల్లూరులోని గోశాలకు అప్పగించింది. బాహుబలి దున్నపోతు గోశాలలో ఉందని తెలుసుకున్న పలువురు దీన్ని చూసివెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.