: ట్రంప్ గెలిస్తే దేశం విడిచి వెళ్లిపోతా.. పులిట్జర్ అవార్డు గ్రహీత ఫ్రీడ్‌లాండర్ సంచలన వ్యాఖ్య


రిపబ్లికన్ల తరపు నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలిస్తే తాను దేశం నుంచి వెళ్లిపోతానని పులిట్జర్ అవార్డు గ్రహీత, చరిత్రకారుడు, రచయిత సాల్ ఫ్రీడ్‌లాండర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ వైఖరితో ట్రంప్‌లాంటి పిచ్చోడు గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్నారు. హిల్లరీ కొన్ని విషయాల్లో వాస్తవాలు దాస్తున్నారని పేర్కొన్న ఫ్రీడ్‌లాండర్.. ఆదాయ వివరాలు వెల్లడించనప్పటికీ ట్రంప్‌ను చాలామంది నమ్ముతున్నారని అన్నారు. ఒకవేళ ట్రంప్ కనుక గెలిస్తే తాను అమెరికాను వదిలి వెళ్లిపోతానని శుక్రవారం ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News