: రామ్ తన సినిమాల్లో హీరోయిన్ ని మించి అందంగా కనపడతాడు: హీరో నాని
‘నా సినిమాల్లో హీరోయిన్ అందంగా ఉంటుందని చెబుతుంటారు. కానీ, రామ్ తన సినిమాల్లో హీరోయిన్ని మించి అందంగా కనపడతాడు’ అని హీరో నాని అన్నాడు. ‘హైపర్’ చిత్రం ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రతి కుటుంబంలో ‘హైపర్’గా ఉండే ఒక వ్యక్తి ఉంటాడని, తమ కుటుంబంలో తన అక్క కొడుకు హైపర్ గా ఉంటాడని అన్నారు. హీరో రామ్ విషయానికొస్తే, తాను ‘కందిరీగ’ సినిమా చూసినప్పుడే ఆ చిత్రానికి ‘హైపర్’ అని పేరు పెడితే బాగుంటుందని అనుకున్నానని అన్నాడు. నాడు తానుకున్నది ఈ రోజున నిజమైందని, రామ్ హీరోగా రూపొందిన ఈ ‘హైపర్’ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని అన్నాడు.