: ‘హైపర్’ ఆడియో ఫంక్షన్ కు హాజరైన హీరో రామ్
ప్రముఖ నటుడు రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హైపర్’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని జేఆర్ సీ ఫంక్షన్ హాల్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రామ్, రాశీఖన్నా, సంగీత దర్శకుడు జిబ్రాన్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ‘హైపర్’లో రామ్ సరసన రాశీఖన్నా జంటగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్, పోసాని కృష్ణమురళీ, ప్రభాస్ శ్రీను, మురళీ శర్మ, తులసీ, హేమ తదితరులు నటించారు.