: ఆనాడు సోనియాగాంధీ నాకు స్వయంగా చెప్పారు: వెంకయ్యనాయుడు
రాష్ట్రాన్ని విడదీస్తున్న విషయాన్ని స్వయంగా సోనియాగాంధీ నాడు తనకు చెప్పారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘రాష్ట్ర విభజన సమయంలో సోనియా గాంధీ ఆ మాట నాకు చెప్పారు. సమైక్యాంధ్రా కాదు, ఏపీకి ఏం కావాలో అడగాలని చాలామంది నాయకులకు నేను చెప్పాను. విభజన బిల్లు సరిగ్గా రూపొందించి ఉంటే ఇబ్బందులు తలెత్తేవి కావు. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేదు. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు నేను చాలా కృషి చేస్తున్నాను. చాలా మంది నాయకులు తమ హోదాను పెంచుకునేందుకు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు ప్రాంతీయ భేదాలు లేవు.. నేను జాతీయవాదిని’ అని వెంకయ్యనాయుడు అన్నారు.