: ‘ఓ వాన దేవా! శాంతించు’ అన్నట్లుగా దండం పెడుతున్న నాగార్జున !


దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఈ చిత్రంలో హథీరామ్ బాబా పాత్రను నాగార్జున పోషిస్తున్నాడు. ఈ చిత్రం సెట్ కు సంబంధించిన ఫొటోలను చిత్రయూనిట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఒక ఫొటోలో నాగార్జున ఆకాశం వైపు చూస్తూ దండం పెడుతున్నట్లు ఉంది. ఈ ఫొటోను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి చూస్తే ‘ఓ వానదేవా! శాంతించు’ అంటూ నాగార్జున దండం పెడుతున్నట్లుగా ఉంది.

  • Loading...

More Telugu News