: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 105 పాయింట్లు నష్టపోయి 28,668 పాయింట్ల వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 8,831 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో రిలయన్స్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్ డీఎఫ్ సీ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. నష్టపోయిన షేర్లలో యాక్సిస్ బ్యాంక్, అరబిందో ఫార్మా షేర్లు, ఏసీసీ సిమెంట్, లుపిన్, అంబుజా సిమెంట్ ఉన్నాయి.