: వరద సహాయక చర్యల కోసం ఆర్మీ సహకారం కోరిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో వరద సహాయక చర్యలకు సహకరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ కల్నల్ జీబీఎంయూ రావుకి ఈరోజు లేఖ రాసింది. తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, వరద తగ్గేవరకు సహకారం అందించాలని ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ఆర్మీతో సమన్వయం చేసుకునేందుకు ముగ్గురు జీహెచ్ఎంసీ అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈరోజు రాత్రి నుంచి వాతావరణంలో సాధారణ పరిస్థితులు నెలకొనేంతవరకు కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్మీతో కలిసి సంబంధిత అధికారులు, సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించాలని తెలిపింది.