: 48 గంటల సమయం ఇస్తున్నాం...భారత్ విడిచి వెళ్లిపోండి: పాకిస్థాన్ నటులకు ఎమ్ఎన్ఎస్ హెచ్చరికలు
పాకిస్థాన్ నటులకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అల్టిమేటం జారీ చేసింది. ఎమ్ఎన్ఎస్ చిత్రపట్ సేన నేత అమేయ ఖోస్కర్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ నటులంతా 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆయన సూచించారు. అలా కాని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. మహారాష్ట్ర, ముంబైలలో పాకిస్థాన్ నటుల సినిమా షూటింగ్ లను అనుమతించేందుకు అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ నటులు నటించిన కారణంగా రణ్ బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన 'యే దిల్ హై ముష్కిల్', షారూఖ్ ఖాన్ నటించిన 'రయీస్' సినిమాల విడుదలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు.