: రాజ్ నాథ్ సింగ్ తో అరకు ఎంపీ కొత్తపల్లి గీత భేటీ


కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో విశాఖపట్టణం జిల్లా అరకు నియోజకవర్గ ఎంపీ కొత్తపల్లి గీత సమావేశమయ్యారు. తెలంగాణలో తాను కొనుగోలు చేసిన భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆక్రమించిందని గతంలో ఆమె రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్తపల్లి గీత ఆ భూములను కొనుగోలు చేయలేదని, ఆమె ఉద్యోగంలో ఉండగా, అక్రమంగా ఆ భూములను కొట్టేశారని, అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఆమె కేంద్ర హోం మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News