: హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లు, దాతల నుంచి ఆహార పదార్థాల సేకరణ.. వరద బాధితులకు పంపిణీ
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల ధాటికి వరదలు సంభవించడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసర సరుకులు అందించే ప్రయత్నం చేస్తోంది రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్ఛంద సంస్థ. నగరంలోని 9 ప్రభుత్వ శాఖల ద్వారా వర్ష బాధితులకు ఆహారపొట్లాల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. అందుకోసం నగరంలోని స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, దాతల నుంచి ఆహార పదార్థాలు సేకరిస్తోంది. వాటిని నగరంలోని వరదలు భారీగా సంభవించిన ప్రాంతాలయిన నిజాంపేట, భవానీనగర్, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, ఆల్వాల్ తదితర ప్రాంతాల్లో పంపిణీ చేయనుంది.