: గుంటూరు-నరసరావుపేట, అమరావతి-విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు
ఆంధ్రప్రదేశ్ లో పల్నాడులో కురిసిన వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, జలాశయాలు నిండిపోయాయి. ఎడతెరిపిలేని వర్షాల ధాటికి రహదారులు కోతకు గురయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారులపై భారీ ఎత్తున నీరు ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. గుంటూరు-నరసరావుపేట, అమరావతి-విజయవాడ మధ్య రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. ఈ మార్గాల్లో ఉన్న రహదారులు కొట్టుకుపోవడానకి తోడు, రహదారులపై భారీఎత్తున వరదనీరు ప్రవహిస్తుండడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి.