: సరదా తీర్చుకునేందుకు దొంగగా మారిన కుర్రాడు!


ఢిల్లీకి చెందిన అమృత్ సింగ్ (19) అనే కుర్రాడు తన సరదా తీర్చుకునేందుకు దొంగగా మారాడు. ఐదవ తరగతి వరకు చురుగ్గా ఉన్న అమృత్ ఆ తరువాత స్నేహాల కారణంగా చెడిపోయాడు. ఏసీలో సేదతీరాలని, ఖరీదైన కార్లలో అర్ధరాత్రి ఢిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టాలని ఇతనికి సరదా. ఈ సరదా తీర్చుకునేందుకు తొలుత కార్ల బ్యాటరీలు, ఇతర విడిభాగాలు కొట్టేసేవాడు. అలా వచ్చిన డబ్బుతో ఏసీ హోటళ్లలో భోజనం చేసి ఒక సరదా తీర్చుకునే వాడు. తర్వాత తూర్పుఢిల్లీలోని గాంధీ నగర్ లో హోండా సిటీ కారును దొంగిలించే ప్రయత్నంలో ఉండగా పోలీసులకు దొరికిపోయాడు. దీంతో అతనిని విచారించిన పోలీసులకు తనకు ఏసీ అన్నా, కార్లు అన్నా మోజు అని, ఆ సరదాలు తీర్చుకునేందుకే తాను దొంగగా మారానని వెల్లడించాడు. దొంగిలించిన కారులో కొంత దూరం వెళ్లి, రాత్రంతా ఏసీ వేసుకుని నిద్రపోయేవాడని, అలా ఏసీ, కారు రెండింటి సరదా తీర్చుకునేవాడని డీసీపీ రిషిపాల్ తెలిపారు. కారు పాడైపోతే దానిని వదిలేసి ఇంకో కారు దొంగిలించేవాడని, అతనిపై ఇప్పటి వరకు 16 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News