: రాత్రంతా వర్షమే.. ఏపీ, తెలంగాణ జలమయం.. భారీగా పంటనష్టం!


తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. హైదరాబాదుతో పాటు నల్గొండ జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర మొత్తాన్ని వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఐదు జిల్లాల్లో చెరువులు నిండిపోయాయి. వాగులు, వంకలు, నదులు పరవళ్లుతొక్కుతున్నాయి. కురిసిన వర్షాల ధాటికి భారీ ఎత్తున పంటనష్టం వాటిల్లింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో వివిధ ప్రాంతాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు ఇంచుమించు తెగిపోయాయి. రవాణా వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం వేకువజాము వరకు అలాగే కురిసింది. దీంతో రెండు రాష్ట్రాల్లోని మెజారిటీ ప్రాంతాలు జలమయమయ్యాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి.

  • Loading...

More Telugu News