: ఏపీలో భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష... అధికారులకు సూచనలు!
ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబునాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంతాల్లో సహాయకచర్యలను సమీక్షించే నిమిత్తం ఈరోజు రాత్రి విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. అంతకుముందు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలని కోరారు. వరదల్లో గల్లంతైన వారిని రక్షించేందుకు రెండు హెలికాఫ్టర్లను సిద్ధంగా ఉంచాలని, సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు.