: ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్టాత్మక సదస్సు
ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. ఇటీవలే విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల సదస్సు జరిగిన విషయం తెలిసిందే. అలాగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు కూడా ఏపీలోనే నిర్వహించాలని సంబంధిత అధికారులు ఈరోజు నిర్ణయించుకున్నారు. తిరుపతి పట్టణం ఈ సదస్సుకు వేదిక కానుంది. వచ్చే ఏడాది జనవరి 3న ఈ సదస్సు ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభించి ఉపన్యాసం చేయనున్నారు.