: ముగిసిన తొలి రోజు ఆట... మిగిలింది ఒక్క వికెటే!
న్యూజిలాండ్ తో కాన్పూర్ లో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజున భారత్ 9 వికెట్ల నష్టానికి 291 పరుగులతో సరిపెట్టుకుంది. మధ్యాహ్నం లంచ్ విరామ సమయానికి ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 150కి పైగా పరుగులు చేసిన భారత్, ఆ తరువాత మాత్రం విఫలమైంది. కీలక ఆటగాళ్లంతా ఒకరి తరువాత ఒకరు పెవీలియన్ దారిమళ్లారు. న్యూజిలాండ్ బౌలర్ల వ్యూహం ఫలించగా, ఒక దశలో 400 వరకూ వెళుతుందనుకున్న స్కోరు ఆ తర్వాత నెమ్మదించింది. ఇక రేపు ఉదయం రెండో రోజు ఆటను ప్రస్తుతం 16 పరుగుల వద్ద ఉన్న జడేజా, 8 పరుగుల వద్ద ఉన్న ఉమేష్ యాదవ్ కొనసాగించనున్నారు.