: ఏ రోజు ఏ మూడ్ లో ఉన్నానో నా డ్రెస్సులే చెబుతాయి: సన్నీలియోన్
‘ఏ రోజు ఏ మూడ్ లో ఉన్నాననే విషయాన్ని నేను ధరించే డ్రెస్సులే చెప్పేస్తాయి’ అంటోది ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్. సినీ తారలైనంత మాత్రాన బయట కూడా గొప్పగా కనిపించాలా? అని చాలా మంది అనుకుంటూ ఉంటారని.. అలా కనిపిస్తూ, ఫ్యాషన్ దుస్తులు ధరిస్తేనే ప్రజలు గౌరవిస్తారనేది తన అభిప్రాయమని చెప్పింది. సెలబ్రిటీలు మంచి వ్యక్తులా? కాదా? అనే విషయం అనవసరమని, వారు ధరించే డ్రెస్సులను బట్టే ప్రజలు ఒక నిర్ణయానికి వస్తుంటారని సన్నీలియోన్ చెప్పింది. ఆ విధంగా ఆలోచించడం మానవుడి నైజమని, ఎదుటివారు ధరించే దుస్తులను బట్టే వారి స్థాయిని మనం అంచనా వేస్తుంటామని తెలిపింది. తాను ఫ్యాషన్ దుస్తులు ధరించినప్పుడు తన గురించి ఎవరేమనుకుంటున్నారన్నది తెలుసుకోవడం తనకు ఇష్టమని సన్నీలియోన్ తన మనసులో మాట చెప్పింది.