: ఆర్బీఐపై కేంద్రం పెత్తనం షురూ... పరపతి కమిటీ నామినీలు వీరే


ఇండియాలో వడ్డీ రేట్లు ఏ మేరకు ఉండాలి? ఎప్పుడు తగ్గించాలి? ఎప్పుడు పెంచాలి? వీటన్నింటినీ ఇంతవరకూ పర్యవేక్షిస్తున్న ఆర్బీఐ అధికారాలకు కత్తెర విధించాలని నిర్ణయించిన కేంద్రం మానిటరీ పాలసీ కమిటీని గురువారం నాడు ప్రకటించింది. ఈ కమిటీ నేతృత్వంలోనే వచ్చే నెల 4న పరపతి సమీక్ష జరగనుంది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ పామి దువా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (అహ్మదాబాద్) ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ఢోలాకియాలను నియమించింది. ఈ కమిటీతో పాటు రిజర్వ్ బ్యాంకు డైరెక్టర్లు ముగ్గురు పరపతి సమీక్షను నిర్వహిస్తారు. ఆపై వడ్డీ రేట్లపై ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. ఓటింగ్ లో కూడా నిర్ణయం వెలువడకుంటే, ఆర్బీఐ గవర్నర్ ఓటు ఎటువైపుంటుందో ఆ నిర్ణయం అమలవుతుందన్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ఓ స్వతంత్ర సంస్థగా ఉన్న ఆర్బీఐపై కేంద్రం కర్రపెత్తనం చేయాలని చూడటాన్ని పలువురు ఆర్థిక వేత్తలు విమర్శించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News