: నిజాం పేటలో పర్యటిస్తున్న కేటీఆర్


హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నిజాంపేటలో పర్యటిస్తున్నారు. నిజాంపేట భండారి లే అవుట్ ను కూడా ఆయన పరిశీలించారు. వరద నీటిలో చిక్కుకున్న అపార్టుమెంట్ల గురించి ఆరా తీశారు. స్థానికుల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతకుముందు, బేగంపేట్ లోని అల్లంతోట బావి, మయూరి మార్గ్ నాలాలను ఆయన పరిశీలించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.

  • Loading...

More Telugu News