: సొంత మామ‌నే వెన్నుపోటు పొడిచారు.. ఇక ప్ర‌జ‌ల‌ని మోసం చెయ్య‌రా?: చ‌ంద్ర‌బాబుపై జ‌గ‌న్ ఆగ్ర‌హం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్ర‌త్యేక హోదాపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరుని నిరసిస్తూ ఆయన ఈరోజు ఏలూరులో యువభేరి నిర్వ‌హిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... హోదాపై టీడీపీ నేతల మాటలు వింటుంటే... ఎన్నిక‌లు అయిపోయిన త‌రువాత ప్ర‌జ‌ల‌తో ప‌ని అయిపోయిందన్న వైఖరితో వారు ఉన్నట్లు అర్థమవుతుందని అన్నారు. ఢిల్లీలో బీజేపీ నేతలు హోదా ఇవ్వ‌ని ప‌రిస్థితి.. ఇక్కడ రాష్ట్ర ప్ర‌భుత్వం అడ‌గ‌ని ప‌రిస్థితి ఉందని జగన్ అన్నారు. ‘ఢిల్లీలో వారు ఏం ఇచ్చినా, ఇవ్వ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు అన్న ధోర‌ణిలో చంద్రబాబు ఉన్నారు. బీజేపీని వ‌ద‌ల‌బోన‌నే అంటున్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నందుకే చంద్రబాబు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్య‌మంత్రి సూట్‌కేసులు పంపించినా.. ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినా అరెస్టు కాలేదు.. రాజీనామా చేయ‌లేదు.. మ‌న దేశంలోనే ఇటువంటి ప‌రిస్థితి ఉంది. అంత‌గొప్ప‌గా చంద్ర‌బాబు మేనేజ్ చేయ‌గ‌లుతారు. అధికారం కోసం, కుర్చీ కోసం సొంత మామ‌నే వెన్నుపోటు పొడిచారు ఇక ఐదు కోట్ల ఆంధ్రుల‌ని మోసం చేయ‌రా?... హోదాపై ఇప్పుడు ఎన్నో త‌ప్పుడు ప్ర‌చారాలు మొద‌లు పెట్టారు’ అని జగన్ వ్యాఖ్యానించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్లే హోదా సాధ్యం కాదని బీజేపీ, టీడీపీ చెబుతున్నాయి. హోదాపై అస్సలు బీజేపీ నేత‌లు చెప్పే కారణాలు ఆ సిఫార్సుల్లో లేనేలేవని జగన్ అన్నారు.

  • Loading...

More Telugu News