: గుండె సంబంధిత వ్యాధితో విమానంలోనే ప్రాణాలు విడిచిన పసికందు
కోల్‌కతా నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తోన్న ఇండిగో విమానంలో విషాదం చోటుచేసుకుంది. ఓ పసికందు విమానంలోనే మృతి చెందింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తమ చిన్నారికి వైద్యం చేయించడం కోసం కోల్‌కతాకి చెందిన దంపతులు విమానంలో బెంగళూరుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. అయితే విమానం కోల్‌కతా నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే తమ చిన్నారి ఆరోగ్యం పూర్తిగా విషమించడాన్ని వారు గమనించారు. దీంతో రాయ్‌పూర్‌లో ఇండిగో విమానాన్ని పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందింది.